హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై కేసు నమోదు

హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై కేసు నమోదు

హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీపై బంజారాహిల్స్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయింది. మల్లేపల్లి ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఖాజా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతని భార్య ఫర్‌జానౌనీసా బేగం హైదరాబాద్ లో ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో హీరా రీటైల్‌ అండ్‌ ప్రై. లిమిటెడ్‌, హీరా టెక్స్‌టైల్‌ ప్రై. లిమిటెడ్‌ కంపెనీల్లో మహ్మద్‌ ఖాజా రూ. 25లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తంకు సంబంధించి హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు చెక్కులను కంపెనీ యాజమాన్యానికి ఇచ్చారు. ఈ వ్యవహారంను అతని భార్య ఫర్‌జానౌనీసా బేగం చోసుకునేది.

డబ్బులు తీసుకున్న హీరా గ్రూప్‌ యాజమాన్యం ఇంతవరకు ప్రాఫిట్స్‌ గానీ, పెట్టిన పెట్టుబడి గానీ ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడుగుతే యాజమాన్యం ఏదో మాయమాటలు చెప్పి దాటవేస్తున్నారు. డబ్బులు మరో రెండు నెలల తర్వాత ఇస్తామని చెప్పి.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు. దాంతో ఫర్‌జానౌనీసా బేగం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.