రజనీకాంత్ దర్శకుడిపై కేసు నమోదు

రజనీకాంత్ దర్శకుడిపై కేసు నమోదు

పా.రంజిత్.. సూపర్ స్టార్ రజనీతో వరుసగా 'కబాలి, కాలా' లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  తన సినిమాలతో ఎక్కువగా దళితుల పక్షాన నిలబడే ఈయనపై పోలీస్ కేసు నమోదైంది.  మొన్నామధ్య నీల పులిగ‌ల్ ఇయ‌క్కం సంస్థ‌ నిర్వహించిన ఉమ‌ర్ ఫ‌రూక్ వ‌ర్ధంతి సభలో పాల్గొన్న రంజిత్ రాజరాజ చోళన్ దళితుల్ని హింసించారని మాట్లాడారు. 

దీంతో నొచ్చుకున్న రాజరాజ చోళన్ వర్గీయులు రంజిత్ కులాన్ని విరోధించేలా మాట్లాడుతున్నారని, ఆయన మాటలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులకు పిర్యాధు చేశారు.  పిర్యాధు అందుకున్న పోలీసులు రెండు సెక్షన్ల కింద రంజిత్ పై కేసు నమోదు చేశారు.