పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు

పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడులు చేస్తున్నారని.. తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని పవన్‌ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  హైదరాబాద్‌లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించిన జేఏసీ నేతలు.. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకోబోయని స్పష్టం చేశారు.