తలసానిపై కేసు నమోదు

తలసానిపై కేసు నమోదు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేవారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించిన ఆయనపై కేసు పెట్టారు. ఈనెల ఎనిమిదో తేదీ రాత్రి తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి తలసాని,  ఎంపీ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బిషప్‌ గొల్లపల్లి జాన్‌తో కలిసి వారు ప్రచారం చేశారంటూ ఫిర్యాదు అందింది. ఈక్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.