దర్శకుడు బాబీపై యాక్సిడెంట్‌ కేసు

దర్శకుడు బాబీపై యాక్సిడెంట్‌ కేసు

మద్యం మత్తులో కారు నడపటమే కాకుండా.. వేరే కారును ఢీకొట్టిన ఘటనలో సినీ దర్శకుడు బాబీపై కేసు నమోదైంది. అమీర్‌పేటకు చెందిన హర్మీందర్ సింగ్ అనే వ్యక్తి నిన్న రాత్రి తన కుటుంబంతో కలిసి ఒక శుభకార్యానికి హాజరై.. తిరిగి తన కారులో ఇంటికి తిరిగివస్తుండగా.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 33 వద్ద దర్శకుడు బాబీ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్మీందర్ కారు ధ్వంసం అవ్వడంతో.. బాబీతో పాటు మరో ముగ్గురు కిందకు దిగి.. తాను పెద్ద దర్శకుడినని.. తన ఇల్లు పక్కనే ఉందని.. అక్కడికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పాడు.. దీనికి హర్మీందర్ సమ్మతించాడు.. అయితే అతని తల్లికి ఛాతినొప్పి రావడంతో.. ఆమెకు సపర్యల చేస్తుండగా బాబీ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. జరిగిన సంఘటనపై హర్మీందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.