బ్యాంకులకు వరుస సెలవులు..

బ్యాంకులకు వరుస సెలవులు..

బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రధాన బ్యాంకులు గురువారం నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 18వ తేదీ మహర్నవమి, 19న విజయదశమి, 20న రెండో శనివారం, 21న ఆదివారం కావడంతో 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ సెలవు ప్రభావం ఏటీఎంలపై పడే అవకాశం ఉంది. వరుస సెలవుల కారణంగా ఏటీఎంలు నిండుకునే పరిస్థితి నెలకొంది. ఐతే.. కొన్ని రాష్ట్రాల్లో నవమి, దశమిలకు వేర్వేరు రోజుల్లో సెలవుల ప్రకటించినందున ఖాతాదారులు అందుకు తగ్గట్టుగా లావాదేవీలు నిర్వహిచడం ఉత్తమం.