నోట్ల రద్దుకి ముందు కంటే 19.1% పెరిగిన నగదు చలామణి

నోట్ల రద్దుకి ముందు కంటే 19.1% పెరిగిన నగదు చలామణి

నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి సుమారు 20 శాతం పెరిగినట్టు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తాపత్రిక తన కథనంలోని తెలిపింది. నగదు రహిత సమాజం కోసం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కృషి చేస్తున్నప్పటికీ వ్యవస్థలో నగదు పరిమాణం పెరుగుతూ వస్తోందని వివరించింది. 

ఆర్బీఐ నుంచి సేకరించిన తాజా వివరాల ప్రకారం మార్చి 15, 2019 నాటికి చలామణిలోని నగదు 19.14 శాతం పెరిగి రూ.21.41 లక్షల కోట్లకు చేరింది. నవంబర్ 4, 2016 నాటికి ఇది చలామణిలోని నగదు రూ.17.97 లక్షల కోట్లు ఉంది. గత ఒక్క ఏడాదిలోనే చలామణిలోని నగదు రూ. 3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇదే కాలానికి డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండగా ఇలా జరగడం విశేషం.