తమిళనాట కుల చిచ్చు

తమిళనాట కుల చిచ్చు

తమిళనాడులో జరిగిన ఒక యాక్సిడెంట్ రెండు కులాల మధ్య చిచ్చు రేపింది. ఎస్సీ శామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కారును పాండియన్ అనే దేవఘర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఢీ కొన్నాడు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దళిత వర్గాల ప్రజలు ఆగ్రహంతో దాడులకి పాల్పడ్డారు. వేదారణ్యం పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు, అలాగే దేవఘర్ వర్గానికి చెందిన యాక్సిడెంట్ చేసిన వాహానాన్ని పోలీస్ స్టేషన్ ముందే కాల్చివేశారు. దీంతో తిరగబడిన దేవఘర్ వర్గం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం తలను పగలకొట్టి రోడ్డుపై విసిరేశారు. దాంతో నాగపట్నంలోని వేదారణ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రెండు వర్గాలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అదనపు బలగాలను  హుటాహుటిన పంపింది.