'క్యాట్‌ కార్డు' రద్దు..!

'క్యాట్‌ కార్డు' రద్దు..!

'క్యాట్‌ కార్డు'ను టీఎస్‌ఆర్‌టీసీ రద్దు చేసింది. విహారి, వనితా కార్డులకూ గుడ్‌బై చెప్పింది. ప్రయాణికుల ఆదరణ తగ్గడంతో ఈ మూడు కార్డులనూ రద్దు చేస్తున్నామని ఆర్టీసీ ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్డులకు విపరీతమైన గిరాకీ ఉండేది. కానీ.. బస్సు ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కార్డులకూ ఆదరణ తగ్గిపోయింది. ఈ క్రమంలో రాయితీ కార్డులు ఏమరకు ఉపయుక్తం అనే అంశంపై అధ్యయనం కోసం ఆర్టీసీ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం.. క్యాట్‌, విహారి, వనితా కార్డులను రద్దు చేయాలని నిర్ణయించారు.