అక్కడ మొబైల్ ఛార్జింగ్ చేస్తే...డేటాతో పాటు ఖాతాకూడా లూటీ... 

అక్కడ మొబైల్ ఛార్జింగ్ చేస్తే...డేటాతో పాటు ఖాతాకూడా లూటీ... 

మొబైల్ ఫోన్... ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కనిపించే సాధనం.  మొబైల్ లేకపోతె క్షణం కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది.  మొబైల్ ఫోన్ ద్వారా విలువైన సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఇక ఇదిలా ఉంటె, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సాకెట్స్ ఉంటున్నాయి.  అయితే, ఈ సాకెట్స్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.  

ఎందుకంటే, ఈ సాకెట్స్ ద్వారా మొబైల్ ఫోన్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉన్నది.  అంతేకాకుండా, ఈ డేటా ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లి ఖాతాలను లూటీ చేసే అవకాశం ఉంటుంది.  కాబట్టి మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.