ఐటీ రిట‌ర్న్‌ల‌ గ‌డువు మ‌రోసారి పొడిగింపు

ఐటీ రిట‌ర్న్‌ల‌ గ‌డువు మ‌రోసారి పొడిగింపు

కోవిడ్ అన్నీ మార్చేసింది.. ఆదాయ‌పు ప‌న్ను స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును కూడా మ‌రోసారి మార్చేసింది.. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఐటి రిట‌ర్నుల‌ను సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చెల్లించ‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల మండ‌లి (సీబీడీటీ) తాజాగా ప్ర‌క‌టించింది.. గ‌తంలో విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. ఈ గ‌డువు రేపటి (జులై 31)తో ముగిసిపోనుంది.. దీంతో.. మ‌రోసారి పొడిగించిన కేంద్రం... సెప్టెంబ‌ర్ 30వ తేదీ చివ‌రి తేదీగా నిర్ణ‌యించింది.. క‌రోనా సంక్షోభం నే‌థ్యంలో ప‌న్ను చెల్లింపుదారుల సౌల‌భ్యం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెబుతున్నారు ఆదాయ ప‌న్నుశాఖ అధికారులు.. కాగా, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌ర ఐటీ రిట‌ర్న‌లు చెల్లిండానికి గ‌డువును పొడిగించ‌డం ఇది మూడోసారి కావ‌డం విశేషం.