ఐసీఐసీఐ బ్యాంక్ పై సీబీఐ కేసు?

ఐసీఐసీఐ బ్యాంక్ పై సీబీఐ కేసు?

వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల మంజూరులో ఐసీఐసీఐ బ్యాంక్ పూర్వ‌ సీఈఓ చందా కొచ్చ‌ర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్లు సీబీఐ భావిస్తోంది.  చందా కొచ్చ‌ర్‌, ఆమె భ‌ర్త దీప‌క్ కొచ్చ‌ర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై బ్యాంక్ ఇది వ‌ర‌కే ప్రాథ‌మిక ద‌ర్యాప్తు జ‌రిపింది. ఈ నివేదిక ఆధారంగా చేసిన ద‌ర్యాప్తులో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు సీబీఐ భావిస్తంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ టీవీ పేర్కొంది. బ్యాంక్ ప్రాథ‌మిక ద‌ర్యాప్తు నివేదిక‌ను ఎఫ్ఐఆర్‌గా సీబీఐ న‌మోదు చేయ‌వ‌చ్చ‌ని ఆ ఛాన‌ల్ పేర్కొంది. వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ ఏకంగా రూ. 3000 కోట్ల రుణాలను ఇచ్చింది బ్యాంక్‌. దీనికిగాను చందా కొచ్చ‌ర్ భ‌ర్త దీప‌క్ కొచ్చ‌ర్ కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్ పెట్టుబ‌డి పెట్టింది. అయితే ఆ పెట్టుబ‌డి వెన‌క్కి రాక‌పోగా, నిర‌ర్థ‌క ఆస్తిగా మిగిలింది. రుణాలు పొందినందుకు న‌జరానాగా వీడియోకాన్ ఈ పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేసింది.