ఎయిర్‌ ఏషియా సీఈఓపై సీబీఐ కేసు

ఎయిర్‌ ఏషియా సీఈఓపై సీబీఐ కేసు

నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ ఫ్లయింగ్‌ లైసెన్స్‌ను తీసుకున్నారనే ఆరోపణల కింద ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరులోని ఆరు కేంద్రాలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ లైసెన్స్‌లు పొందే విషయంలో 5/20 నిబంధలను కంపెనీ ఉల్లంఘించినట్లు సీబీఐ ఆరోపించింది.

5/20 నిబంధన అంటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించేందుకు లైసెన్స్‌ పొందాలంటే 20 విమానాలు, 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. ఇవి లేకుండా సదరు లైసెన్స్‌ పొందారనేది సీబీఐ ఆరోపణ. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) నిబంధనలను కూడా ఉల్లంఘించారని సీబీఐ అంటోంది. టోనీ ఫెర్నాండెజ్‌తో పాటు గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా, మలేషియా గ్రూప్‌ సీఈఓ, ట్రావెల్‌ ఫుడ్‌ ఓనర్ సునీల్‌ కపూర్‌, ఏయిర్‌ ఏషియా డైరెక్టర్‌ ఆర్‌ వెంకట్రామన్‌, ఏవియేషన్‌ కన్సల్టెంట్‌ దీపక్‌ తల్వార్‌, సింగపూర్‌కు చెందిన ఎస్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ రాజేంద్ర దూబేతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది.