మెహుల్‌ చౌక్సీపై సీబీఐ ఛార్జిషీట్‌

మెహుల్‌ చౌక్సీపై సీబీఐ ఛార్జిషీట్‌

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పాల్పడిన భారీ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్‌ మోదీ తరవాత ఆయన సమీప బంధువు మెహుల్‌ చోక్సీపైనా సీబీఐ ఇవాళ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో మెహుల్‌ చౌక్సీ ప్రధాన ముద్దాయి. ఆయనకు చెందిన గీతాంజలి గ్రూప్‌ సంస్థలు పీఎన్‌బీ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోని ఎగ్గొట్టింది. ఈ కేసులో చోక్సీకి కూడా సంబంధం ఉందని తేలినట్లు సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కుంభకో్ణంలో చౌక్సీకి చెందిన కంపెనీలతో పాటు మరో 16 సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ.