భూషణ్ స్టీల్ అండ్ పవర్ ఆవరణలో సీబీఐ దాడులు

భూషణ్ స్టీల్ అండ్ పవర్ ఆవరణలో సీబీఐ దాడులు

₹.2,348 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఢిల్లీ-ఎన్సీఆర్ లోని భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్)కు సంబంధించిన కార్యాలయాలు, డైరెక్టర్లు, ప్రమోటర్లు, వారి సహచరులపై నివాస ఆవరణలపై సీబీఐ శనివారం దాడులు చేసింది. ఏఎన్ఐ వార్తాసంస్థ కథనం ప్రకారం సీబీఐ బీపీఎస్ఎల్ ఢిల్లీ-ఎన్సీఆర్, చండీగఢ్, కోల్ కతా, ఒడిషాలలోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. 

రోజంతా బీపీఎస్ఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు వారి సహచరుల నివాసాలపై సీబీఐ తనిఖీలు జరుపుతూనే ఉంది. బ్యాంకులను మోసం చేశారని బీపీఎస్ఎల్ డైరెక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వివిధ బ్యాంకులకు భూషణ్ స్టీల్ రూ.48,100 కోట్ల రుణం బకాయి పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్ (ఐబీసీ) ప్రకారం భూషణ్ స్టీల్ ను కొనుగోలు చేస్తామన్న తమ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు టాటా గ్రూప్ కంపెనీ టాటా స్టీల్ మార్చిలో ప్రకటించింది. ఐబీసీ అంటే దివాలా చట్టం వచ్చిన తర్వాత 12 పెద్ద ఎన్పీఏ డిఫాల్టర్ కంపెనీలపై దివాలా ప్రక్రియ ప్రారంభించడం జరిగింది.