సీబీఐలోకి కళంకితులను తెస్తున్నారు

సీబీఐలోకి కళంకితులను తెస్తున్నారు

తమ శాఖలోకి కళింకిత అధికారులను తెస్తున్నాని సీబీఐకి చెందిన ఉన్నతాధికారి భావిస్తున్నారు. సీబీఐకి డిప్యూటేషన్‌పై ఇతర అధికారులను పంపే సమయంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ), ఇతర సీనియర్‌ ప్రభుత్వ కార్యదర్శులు తొందరపడుతున్నారని ఆ అధికారి ద హిందూ దినపత్రికతో అన్నారు. సీబీఐలో రెండవ ఉన్నత అధికారి అయిన వ్యక్తికి సీవీసీ నిర్వహించే సమావేశాలకు సీబీఐ తరఫున హాజరయ్యే పద్ధతి లేదని ఆయన అన్నట్లు ఆ పత్రిక రాసింది. సీబీఐలోకి తొందరపడే అధికారులను నియమిస్తున్న అంశంపై సీవీసీకి సీబీఐ ఉన్నతాధికారి పలు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది. 
సీబీఐకి ప్రస్తుతం అలోక్‌ వర్మ డైరెక్టర్‌గా ఉన్నారు. రెండోస్థానంలో ఉన్న స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ అస్తానా.. సీవీసీ నిర్వహించిన పలు సమావేశాలకు హాజరయ్యారు. అయితే  రాకేస్‌ ఆస్తానా పలు కేసుల్లో నిందితునిగా ఉన్నందున సీబీఐ  తరఫున సీవీసీ సమావేశాలకు హాజరు కాలేరని అలోక్‌ వర్మ భావిస్తున్నారు.