అఖిలేష్‌కు త్వరలోనే సీబీఐ సమన్లు?

అఖిలేష్‌కు త్వరలోనే సీబీఐ సమన్లు?

విచారణకు హాజరు కావాల్సిందిగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ను పిలిచేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో మైన్స్‌ జారీలో అవినీతి జరిగిందని చెప్పిన సీబీఐ... విచారణ సమయంలో సంబంధిత నేతలను, అధికారులను విచారిస్తామని చెప్పింది. సీఎంగా ఉంటూ మైన్స్‌ శాఖను కూడా చూసిన అఖిలేష్‌ దాదాపు 14 ఇసుక మైనింగ్‌ లైసెన్స్‌లకు ఆమోదం తెలిపినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఆయన ఆమోదం తెలిపిన లైసెన్స్‌ల జాబితా తయారు చేసింది. త్వరలోనే ఆయనను విచారణకు సమన్లు జారీ చేయొచ్చని తెలుస్తోంది.