త్వరలో కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ కు సీబీఐ సమన్లు? 

త్వరలో కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ కు సీబీఐ సమన్లు? 

శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఇష్టుడైన అధికారి, కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పీకల్లోతు చిక్కుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. శారదా కుంభకోణం కేసు దర్యాప్తు కోసం తమ ముందు హాజరు కావాలని సీబీఐ త్వరలోనే రాజీవ్ కుమార్ కు సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సమయం పొడిగించాలని ఆయన పెట్టిన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పొందేలా తగిన కోర్టును ఆశ్రయించేందుకు తనకు మరికాస్త సమయం కావాలని రాజీవ్ కుమార్ ఆ పిటిషన్ లో కోరారు. నిన్న సాయంత్రం ఆయన కోల్ కతా సెషన్స్ కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.