కశ్మీర్‌లో కాల్పుల విరమణ..

కశ్మీర్‌లో కాల్పుల విరమణ..

రంజాన్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతినిత్యం ఎన్‌కౌంటర్లు, సోదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారని.. మరికొద్దిరోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతుండటంతో ఆ నెలలోనైనా కాల్పులను తాత్కాలికంగా ఆపాలని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్షం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నాడు అటల్ బిహరీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారని సీఎం గుర్తు చేశారు.

దీనిని పరిగణనలోనికి తీసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‌ఆ నెల రోజులు సైన్యం, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల విరమణ పాటిస్తాయని.. అయితే ప్రజల ప్రాణాలకు నష్టం కలిగేలా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం... భద్రతా దళాలు తగిన రీతిలో బుద్ధి చెబుతాయని రాజ్‌నాథ్ తెలిపారు.