23న విజయోత్సవాలకు అనుమతి లేదు..!

23న విజయోత్సవాలకు అనుమతి లేదు..!

ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి విజయోత్సవ సంబరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు హైదరాబాద్‌ పోలీస్ కమిషన్ అంజనీ కుమార్... కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ఫలితాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలో ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేశామన్న సీపీ... ఫలితాల తర్వాత విజయోత్సవాలకు అనుమతి లేదు... 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ సెంటర్ల నుండి 100 మీటర్ల లోపు సిబ్బంది మినహా ఎవరిని అనుమతించబోమని ప్రకటించారు. ఇక వేసవి దృష్ట్యా సిబ్బందికి మంచి నీరు, మజ్జిగ ఏర్పాట్లు చేశామని తెలిపారు అంజనీ కుమార్.