ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ కు హాజరైన ప్రముఖులు

ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ కు హాజరైన ప్రముఖులు

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఏఎంబి సినిమాస్ లో వేశారు.  ఈ షోకు టాలీవుడ్ నుంచి ప్రముఖులంతా హాజరయ్యారు.  ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా సినిమాకు హాజరైనట్టు తెలుస్తోంది.  

వివి వినాయక్, పూరి జగన్నాధ్, ఛార్మి, తమ్మారెడ్డి భరద్వాజా, నాగ్ అశ్విన్, పరుచూరి గోపాలకృష్ణ తదితర సినీ ప్రముఖులు ఈ షోకు హాజరయ్యారు.  రెండు గంటల 8 సినిమాల నిడివి కలిగిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది మరికొద్ది సేపట్లోనే తేలనుంది.  

జనవరి 9 వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చింది.  ఈ సినిమా బాగుందని టాక్ వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.