సెలెబ్రిటీల గుండెల్ని తాకిన ఇస్రో ప్రయోగం

 సెలెబ్రిటీల గుండెల్ని తాకిన ఇస్రో ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 2 ను విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టింది.  ఈ ప్రయోగంతో ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది.  చంద్రయాన్ 2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగంచడంతో సామాన్యుల దగ్గరి నుంచి సెలెబ్రిటీల వరకు ఇస్రో శాస్త్రవేత్తలకు శాల్యూట్ చేస్తున్నారు.  

ఇస్రో చరిత్ర సృష్టించింది.  అరుదైన ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.  300 టన్నుల అతి బరువైన ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రభాస్ శాల్యూట్ చేశారు.  ఈ ఉపగ్రహాన్ని బాహుబలితో పోల్చడం గర్వంగా ఉందని అన్నారు.  చంద్రయాన్ 2 వెనుక ఇద్దరు మహిళా శాస్త్రవేత్తల కృషి ఉండటం విశేషం.  మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు.  వారికి ఎల్లలు లేవు అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం అని కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.  షారుక్, నాగార్జున, రకుల్ ప్రీత్ తదితరులు కూడా ఇస్రో ప్రయోగం గురించి ట్వీట్ చేశారు.