ర‌జ‌నీకాంత్‌ అవార్డుపై ప్రముఖుల స్పందన

ర‌జ‌నీకాంత్‌ అవార్డుపై ప్రముఖుల స్పందన

దక్షిణ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను రజినీకి ప్రకటించటం పట్ల సినీ ప్రముఖులతో పాటుగా.. రాజకీయ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

‘వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో త‌ర‌త‌రాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న త‌లైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉంది. మీకు నా అభినంద‌నలు’ అని ప్రధాని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ద‌శాబ్దాల పాటు త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక శైలిని చాటుకుంటూ.. ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

‘సూప‌ర్ స్టార్‌, నా ప్రియ మిత్రుడు ర‌జ‌నీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. అత‌నికి ఈ అవార్డు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉంది' అని క‌మ‌ల్ త‌మిళంలో ట్వీట్ చేశాడు.

‘నా ప్రియమైన మిత్రుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం అత్యంత ఆనందకరమైన విషయం’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు

‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం పొందిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని విక్టరీ వెంకటేష్ తెలిపారు.