సైనా-కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రముఖుల హాజరు

సైనా-కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రముఖుల హాజరు

భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నోవాటెల్ హోటల్ (కన్వెన్షన్ హాల్ 4) లో జరిగిన ఈ విందుకు పలువురు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీపరిశ్రమ నుండి నాగార్జున, అమల దంపతులు.. కళ్యాణ్, శ్రీజ దంపతులు.. సుధీర్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ లు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు దానం నాగేందర్, పురందేశ్వరి హాజరయ్యారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప.. హైదరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్‌లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.