ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి - వాడు పోలీసోడు అయ్యుండాలి... 

ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి - వాడు పోలీసోడు అయ్యుండాలి... 

దిశ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత వారిని కోర్టుకు అప్పగించడంతో రిమాండ్ కు అప్పగించారు.  ఆ తరువాత పోలీసులు నిందితులను కష్టడికి కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.  5 వ తేదీన పోలీసులు వారిని జైలులోనే విచారణ చేసింది. ఆ తరువాత 6 వ తేదీ తెల్లవారుజామున వారిని చటాన్ పల్లికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి చూడటంతో అలర్ట్ అయిన పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.  ఈ ఘటనపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  బాధితురాలికి న్యాయం జరిగిందని అంటున్నారు.  ఈ విషయంలో సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.  బాధితురాలికి న్యాయం జరిగిందని, దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసు అయ్యుండాలి అని నాని ట్వీట్ చేశారు.  ఇక సెలెబ్రిటీలు లావణ్య, సమంత, విశాల్ తదితరులు దిశకు న్యాయం జరిగిందని ట్వీట్ చేస్తున్నారు.