ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ

ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం 'క్యాట్‌'కు చేరింది... తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు చేసిన విజ్ఞప్తిని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి హాజరు కాగా.. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేశారని  ప్రశ్నించింది. డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోంశాఖకి సమాచారం ఇచ్చారా? అని ప్రశ్నించిన క్యాట్.. ఐపీఎస్ అధికారికి మే 31వ తేదీ 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించింది క్యాట్.. దీనిపై సమాధానం ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వారం రోజులు సమయం కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది క్యాట్.