అదిరిపోయే ఆఫ‌ర్ తెచ్చిన బ్యాంకు.. వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి మాత్ర‌మే..!

అదిరిపోయే ఆఫ‌ర్ తెచ్చిన బ్యాంకు.. వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి మాత్ర‌మే..!

క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సిన్ ఒక్క‌టి మార్గం.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారినప‌డ‌కుండా భౌతిక‌దూరం పాటిస్తూ, మాస్క్ ధ‌రిస్తూ.. వ్య‌క్తిగ‌తంగా శుభ్రంగా ఉండ‌డే బెట‌ర్ అయినా.. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత క్ర‌మంగా వ్యాక్సినేష‌న్‌పై అంతా దృష్టి సారించారు.. ఇప్ప‌టికే భార‌త్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 కోట్లు దాటిపోగా.. మ‌రింత మందిని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్స‌హిస్తోంది ప్ర‌భుత్వం... ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో వివిధ సంస్థ‌లు, చివ‌ర‌కు హోట‌ల్లు, ప‌బ్‌లు కూడా పాలు పంచుకుంటుండ‌గా.. ఇప్పుడో బ్యాంక్ కూడా రంగంలోకి దిగింది.. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒక బ్యాంక్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. 

ఇంత‌కా బ్యాంక్ ఏంటి అనేగా మీ అనుమానం.. అదే.. ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీని అందిస్తున్న‌టు ప్ర‌క‌టించింది.. సాధార‌ణ ఖాతాదారుల‌తో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్న ఖాతాదారులు.. త‌మ ఎఫ్‌డీల‌పై 0.25 శాతం వరకు అధిక వడ్డీని పొందే ఆఫ‌ర్ తెచ్చింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్‌ను లాంచ్ చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 1111 రోజుల కాల పరిమితితో ఈ ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెడితే 25 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీని సొంతం చేసుకోవచ్చు. క‌రోనా వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.