రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ముందుకా.. వెనక్కా..!?

రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ముందుకా.. వెనక్కా..!?

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది... ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది... ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపైనే ఫోకస్ పెట్టనుంది కేంద్ర మంత్రి వర్గం... ఓవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉండగా... ఇవాళ రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్‌ విజయవంతమైంది... బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. రైతులకు తమ డిమాండ్లపై పట్టువిడకపోవడంతో... కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రైతుల డిమాండ్లకు కేంద్రం దిగివస్తుందా? లేదా? చట్టాల్లో సవరణలు ప్రతిపాదిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రైతు సంఘాల నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం నిర్వహిస్తున్నారు... ఈ రోజు రైతుల చెప్పే విషయాలను రేపు.. కేబినెట్ సమావేశంలో షా స్పష్టంగా ప్రస్తావించనున్నారు.. ఆ తర్వాత కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.