రూ. 2వేల నోటుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కీలక ప్రకటన... 

రూ. 2వేల నోటుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కీలక ప్రకటన... 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్యమైన, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ షాకిస్తున్నారు.  ఇందులో భాగంగానే గతంలో పాత నోట్లను రద్దు చేశారు.  యావత్ దేశం మొత్తం ఈ అనూహ్యమైన సంఘటనతో షాక్ అయ్యింది.  సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.  అయినప్పటికీ 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి గెలిపించారు.  

అయితే, గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  మరికొన్ని రోజుల్లోనే దేశంలో రూ. 2000 నోటును రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.  దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.  రెండువేల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలో రెండు వేల నోటు కనిపించకపోతుండటంతో ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని ప్రజలు భయపడుతున్నారని, అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది.