'పోలవరం పనులపై కేంద్రం సంతృప్తి..'

'పోలవరం పనులపై కేంద్రం సంతృప్తి..'

పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి ఎక్కడా చెప్పలేదని గుర్తుచేసిన ఆయన... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు మొదటి  రేడియల్ గేట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించిన దేవినేని... ప్రాజెక్ట్ అడ్డుకునే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.