పోలవరం మీద కేంద్రం కీలక ప్రకటన !

పోలవరం మీద కేంద్రం కీలక ప్రకటన !

పోలవరం మీద కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర జల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా పోలవరం నిర్మాణం మీద కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తికి పెట్టుకుని కాలపరిమితి లక్ష్యాన్ని 2019 నుంచి 2021 మార్చినట్టు పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులోని వివిధ భాగాల కాంట్రాక్టు నిర్వహణ కారణాల రీత్యా ఈ లక్ష్యాన్ని మార్చినట్టు పీ.పి.ఏ. తెలిపిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇక 2018-19  లో ఖర్చు చేసిన మొత్తం 3047 కోట్లు కాగా కేంద్రం విడుదల చేసింది 1400 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిపాదనల మేరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం  8614 కోట్లు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధుల విడుదల చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ నవంబర్ 26, 2019 నాటి లేఖలో తెలిపినట్టు సమాధానం ఇచ్చారు.