తెరాస ఎమ్మెల్యేకి కేంద్రం షాక్..!!!

తెరాస ఎమ్మెల్యేకి కేంద్రం షాక్..!!!

తెరాస వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.  1993లో జర్మనీకి వలసవెళ్లిన రమేష్ అక్కడ జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు.  ఆ తరువాత 2009 లో తిరిగి ఇండియా వచ్చారు.  ఇండియా వచ్చిన తరువాత ఇండియా పౌరసత్వాన్ని స్వీకరించారు.  ఇండియా వచ్చిన తరువాత అయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.  అయితే, రమేష్ పౌరసత్వంపైనా శ్రీనివాస్ అనే నాయకుడు గతంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర హోంశాఖ వద్దకు వచ్చింది.  

కాగా, 2017 వ సంవత్సరంలో భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. కేంద్ర హోంశాఖ తన పౌరసత్వాన్ని రద్దు చేసిన మాట వాస్తవమే అని, పౌరసత్వ పరిరక్షణకు మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తానని చెన్నమనేని రమేష్ పేర్కొన్నారు. పూర్తిస్థాయి తీర్పు కాపీ వచ్చిన తరువాత న్యాయపోరాటం చేస్తానని చెన్నమనేని పేర్కొన్నారు.  జులై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖ్ పట్టించుకోలేదని చెన్నమనేని పేర్కొన్నారు.