కేంద్రమంత్రి అనంత్ కుమార్ ఇక లేరు

కేంద్రమంత్రి అనంత్ కుమార్ ఇక లేరు

కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్‌ నేత అనంత్‌కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం   తెల్లవారుజామున రెండు గంటల సమయం‌లో మృతి చెందినట్టు డాక్టర్ లు  ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో చికిత్స పొందారు. 1959 జులై 22న బెంగళూరులో జన్మించిన ఆయన 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోడీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఏడున్నర నుండి‌ నేషనల్ కాలేజిలో ప్రజల సందర్శనార్ధం అనంత కుమార్ భౌతికఖాయాన్ని ఉంచనున్నారు కుటుంబ సభ్యులు . మరోవైపు అనంతకుమార్ మృతికి సంతాపంగా ఆఫీసులు, పాఠశాలలకు సెలవు ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం