పోలవరంలో గడ్కరీ... 

పోలవరంలో గడ్కరీ... 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొద్దిసేపటి క్రితం పోలవరం చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అధికారులతో కలిసి రాజమహేంద్రవరం చేరుకున్న గడ్కరీ.. ప్రాజెక్టు ప్రగతిని.. జరుగుతున్న పనులను సమీక్షించారు. ఆ తర్వాత చంద్రబాబుతో కలసి ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. సమీక్షలో పాల్గొననున్నారు. గడ్కరీ రాకతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు  పోలవరం చేరుకున్నారు. దాదాపు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లాలని చూసిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తమను అనుమతించాలని వారు ఆందోళనకు దిగారు. పాస్‌లు ఉన్నవారినే పంపుతామని పోలీసులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.