అలా చేయవద్దంటూ జగన్‌కు కేంద్రం లేఖ

అలా చేయవద్దంటూ జగన్‌కు కేంద్రం లేఖ

ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాఖల వారీగా సమీక్షలు చేపట్టి విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరిగిందని, అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేశారని, పీపీఏలను మరోసారి సమీక్షించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.  దీంతో కేంద్ర ఇంధన శాఖ స్పందించింది.  ఆ శాఖా మంత్రి ఆర్కే సింగ్  పీపీఏలను మరోసారి సమీక్షించడం సరికాదంటూ జగన్‌ను ఉద్దేశించి లేఖ రాశారు. 

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పునరుత్పడ్డాక ఇంధన రంగం ఒకటని, అది భారీ స్థాయిలో విదేశాల పెట్టుబడులను ఆకర్షిస్తోందని పేర్కొన్న ఆయన ఈ రంగంలో ఇలా చట్టం సరిగా లేదని, కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం బయటకు వెళ్తే పెట్టుబడులు ఆగిపోయి అభివృద్ధి నిలిచిపోతుంది.  టారిఫ్‌లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్లు నిర్దారిస్తాయి.  కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేయడం చట్ట విరుద్ధం.  అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే రద్దు చేసి ప్రాసిక్యూషన్‌ చేయవచ్చని, లేని పక్షంలో కుదరదని స్పష్టం చేస్తూ వివిధ రాష్ట్రాల టారిఫ్‌ ధరలను సవివరంగా పంపారు.