చంద్రబాబుపై కేంద్ర మంత్రి ఆగ్రహం

చంద్రబాబుపై కేంద్ర మంత్రి ఆగ్రహం

ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మా ఉద్దేశాలను ప్రశ్నించే ముందు, ముఖ్యమంత్రి ఉద్దేశాలేంటో బయటకు చెప్పాలని అన్నారు. వారం క్రితం కూడా విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాకు లేఖలు రాశారని తెలిపారు. ఇచ్చిన తరువాత ఇప్పుడు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇవ్వనంత వరకు మాపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. జోన్ ఇవ్వడం వారికి ఇష్టం లేదేమో.. అందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి వేరే కారణాలు ఉన్నాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశం విషయంలో చంద్రబాబు మాటలు రాజకీయం కోసమా...!? ప్రజల కోసమా..!? అని చంద్రబాబును మీడియా ప్రశ్నించాలని కేంద్ర మంత్రి పీయూష్ తెలిపారు.