ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ వర్శిటీ

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ వర్శిటీ

రాష్ట్ర విభజన చట్టంలో మరో హామీ నెరవేర్చేదిశగా కేంద్రప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి పచ్చ జెండా ఊపింది. అనంతపురం జిల్లా జంతలూరులో ఆ వర్శిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. ఏపీ విభజన చట్టంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో నాటి ప్రభుత్వం రాష్ట్రంలో పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఇప్పటికే ఐఐటీ, ఐఐఎం, నిట్ సహా పలు సంస్థలను ఏర్పాటు చేసింది.. తాజాగా  కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేయాలని.. నిధుల విడుదలతో పాటు నిర్మాణ పనులను కేంద్ర మానవ వనరుల శాఖ పర్యవేక్షించాలని కేబినెట్ సూచించింది.