మమత ధర్నాలో కూర్చున్న ఐపీఎస్ ల పతకాలు వెనక్కి

మమత ధర్నాలో కూర్చున్న ఐపీఎస్ ల పతకాలు వెనక్కి

సీబీఐ వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ధర్నాలో కూర్చున్న పోలీస్ అధికారులపై పిడుగు పడింది. ఐదుగురు పోలీస్ అధికారులపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఫిబ్రవరి 4న వీరి గురించి సమాచారం కోరింది. ఐదుగురు ఐపీఎస్ అధికారుల పతకాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ మమతా బెనర్జీ ధర్నాలో పాల్గొన్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల పతకాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అధికారులెవరికీ భవిష్యత్తులో ఎలాంటి కేంద్ర స్థాయి డిప్యుటేషన్ పోస్టింగ్ లు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పతకాలు కోల్పోనున్న ఐదుగురు అధికారుల జాబితా ఇలా ఉంది.

వీరేంద్ర (1985 బ్యాచ్) డీజీపీ, పశ్చిమ బెంగాల్
వినీత్ కుమార్ గోయల్ (1994 బ్యాచ్) ఏడీజీ, సెక్యూరిటీ డైరెక్టర్
అనుజ్ వర్మ (1991 బ్యాచ్) ఏడీజీ, లా అండ్ ఆర్డర్
జ్ఞానవంత్ సింగ్ (1993 బ్యాచ్) సీపీ, బిధాన్ నగర్
సుప్రతీమ్ సర్కార్ (1997 బ్యాచ్) సీపీ