కీలక నిర్ణయం.. ఇక పని ప్రదేశంలోనే వ్యాక్సినేషన్..!

కీలక నిర్ణయం.. ఇక పని ప్రదేశంలోనే వ్యాక్సినేషన్..!

కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సమయంలో.. దానిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావిస్తోంది ప్రభుత్వం.. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ వేయడంతో.. పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా.. కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ కేంద్రాలు పెడితే ఎలా ఉంటుంది? అనే దానిపై ఆలోచన చేస్తోంది కేంద్రం ప్రభుత్వం.. 100 మందికి పైగా 45 ఏళ్లపై బడిన ఉద్యోగులున్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయల్లో వ్యాక్సినేషన్‌ సెంటర్లపై దృష్టి సారించింది. ఏప్రిల్ 11వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.. 

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖరాసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. 45 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల జనాభాలో గణనీయమైన భాగం ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యవస్థీకృత రంగంలో ఉందని.. కార్యాలయాలలో లేదా తయారీ మరియు సేవలలో అధికారిక వృత్తిలో పాల్గొంటుందని అన్నారు. ఈ జనాభాకు వ్యాక్సిన్ ప్రక్రియ పెంచడానికి, వ్యాక్సిన్ సెంటర్లను పని ప్రదేశాల్లోనే నిర్వహించవచ్చు, ఈ పని ప్రదేశాలను ఇప్పటికే ఉన్న కోవిడ్ టీకా కేంద్రంతో ట్యాగ్ చేయడం ద్వారా సుమారు 100 మంది అర్హత మరియు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులను కలిగి ఉంటారని పేర్కొన్నారు.