ట్విట్టర్‌కు మోడీ సర్కార్ లేఖ

ట్విట్టర్‌కు మోడీ సర్కార్ లేఖ

జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఏం జరుగుతోంది..? ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? జమ్మూ అండ్ కశ్మీర్ పునర్విభజనను అక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారా? లేదా నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా? ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెబుతోంది. ఇక అజిత్ దోవల్ కశ్మీర్‌లో పర్యటించిన అక్కడ స్థానికులతో ముచ్చటించడం.. సైన్యానికి సూచలు చేయడం చేశారు. అయితే, మరోవైపు మాత్రం అక్కడ ఆందోళన జరుగుతున్నట్టు.. ప్రజలు ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలుపుతున్నట్టు కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

అయితే ఈ అంశంపై కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టేట్లు.. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారని.. అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్న పలు అకౌంట్లను గుర్తించింది. వాటిలో కశ్మీర్‌ వేర్పాటువాదనాయకుడు సయ్యద్‌ అలీ గిలానీతో పాటు మరికొందరు ఉన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వివాదస్పద ఖాతాలను తొలగించాల్సిందిగా కేంద్రం ట్విటర్‌కు లేఖ రాసింది. కాగా, జమ్ముకశ్మీర్‌ పునర్విభజన, ఆర్టికల్‌ 370 రద్దుకు ముందే కశ్మీర్‌లో కేంద్రం భారీ సైన్యాన్ని మోహరించింది.. అదనపు బలగాలను దింపి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. తప్పుడు సమాచారాలు వెళ్తాయన్న ఉద్దేశంతో అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కేంద్ర నిలిపివేసిన సంగతి తెలిసిందే.