ధోని సిఎస్కే బాస్ అవుతాడు అంటున్న ప్రస్తుత బాస్ 

ధోని సిఎస్కే బాస్ అవుతాడు అంటున్న ప్రస్తుత బాస్ 

రాబోయే పదేళ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కి ఎంఎస్ ధోని సిఇఓ అవుతాడని తాను అంచనా వేస్తున్నట్లు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సిఇఓ విశ్వనాథన్ తెలిపారు. ఐపీఎల్ 2020 లో ధోని బాగా రాణించాలని నిశ్చయించుకున్నాడని, మార్చిలో చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్ లో ధోని  పొందిన శిక్షణ విధానం నమ్మశక్యం కానిదని విశ్వనాథన్ అన్నారు.  ఈ సీజన్లో ధోని బాగా ఆడాలని అనుకున్నాడు. అయితే ఇప్పటి నుండి 10 సంవత్సరాలలో, అతను చెన్నైలో సూపర్ కింగ్స్ బాస్ గా చెన్నైలో శాశ్వత ఆటగాడు అవుతాడని నా భావన" అని ఇప్పటి బాస్ విశ్వనాథన్ అన్నారు. ఇక 2019 ప్రపంచ కప్‌లో భారత్ ఓడినప్పటినుండి నుంచి ధోని పోటీ క్రికెట్ ఆడలేదు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ వాయిదాకు ముందే మార్చిలో సిఎస్కే శిక్షణా శిబిరానికి ధోని హాజరయ్యాడు. ఇక ప్రస్తుతం అక్టోబర్‌లో ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చూస్తుంది. కానీ దానికి పాక్ అడ్డుపడాలని చూస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.