నాలుగో సీటుపై చాడ ఏమన్నారంటే..

నాలుగో సీటుపై చాడ ఏమన్నారంటే..

మహాకూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించింది తామేనని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ కూటమిలో భాగంగా సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ జాప్యం చేసిందని అన్నారు. రేపటి వరకు వేచి చూసి తమ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ముడు సీట్లపై హామీ లభించిందని.. నాలుగో సీటుపై రేపు క్లారిటీ వస్తుందని చాడ అన్నారు. మునుగోడు, దేవరకొండ స్థానాల్లో ఏదో ఒకటి తమకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీట్ల సర్దుబాటు జరిగాక స్నేహపూర్వక పోటీ ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు కేటాయించిన మూడు స్థానాల్లో ఇతర పార్టీల నేతలు పోటీ చేయకుండా మిగిలిన పార్టీలు చర్యలు తీసుకోవాలని కోరారు.