మరణం తర్వాత బోస్ మ్యాన్ కు గోల్డెన్ గ్లోబ్

మరణం తర్వాత బోస్ మ్యాన్ కు గోల్డెన్ గ్లోబ్

హాలీవుడ్ అవార్డ్స్ అంటే అందిరకీ గుర్తుకు వచ్చేది ఆస్కార్సే. కానీ, అకాడమీ అవార్డ్స్ కు సమానమైన కోలాహలం నెలకొంటుంది ‘గ్లోడెన్ గ్లోబ్స్’ విషయంలో. ఫిబ్రవరీ 28న, ఎట్టకేలకు, 2021 గ్లోడెన్ సెరిమనీ జరిగింది. రెండు నెలలు ఆలస్యంగా ఈసారి విజేతలకు ప్రెస్టేజియస్ గ్లోబ్స్ ను అందించారు! 

ప్రఖ్యాత గ్లోల్డెన్ గ్లోబ్స్ విజేతల పట్టికలో దివంగత చాడ్విక్ బోస్ మ్యాన్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతను నటించిన ‘బ్లాక్ బాటమ్’ సినిమాలోని క్యారెక్టర్ కిగానూ బెస్ట్ యాక్టర్ – డ్రామా – పోస్త్ మస్ అవార్డు లభించింది. అయితే, చాడ్విక్ గత సంవత్సరం క్యానర్సర్ తో పోరాడుతూ 43ఏళ్ల వయస్సులోనే మరణించాడు. ఇక గ్గోల్డెన్ గ్లోబ్స్ లిస్టులో ఈ సంవత్సరం ‘ద క్రౌన్’ హవా కొనసాగింది. ఆరు నామినేషన్లు పొందిన ఈ డ్రామా... బెస్ట్ టీవీ సీరిస్ తో పాటూ మూడు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కూడా పొందింది. అలాగే, ‘నోమాడ్ ల్యాండ్’ బెస్ట్ ఫిల్మ్ గా గ్లోబ్ ను స్వంతం చేసుకుంది. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ కూడా ఇదే సినిమాకిగానూ క్లో ఝావో అందుకున్నారు. వివాదాస్పద మాక్యుమెంటరీ మూవీ ‘బోరట్ సబ్ సిక్వెంట్’ మ్యూజికల్ / కామెడీ క్యాటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ సాధించింది. అదే చిత్రంలోని నటనకిగాను సాచా బరోన్ కోహెన్ బెస్ట్ యాక్టర్ గా నిలిచాడు...

నటీమణుల విషయానికి వస్తే... రోస్ మండ్ పైక్, ఆండ్రా డే బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్స్ పొందారు. ‘ఐ కేర్ ఏ లాట్, ద యూనైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే’ చిత్రాలకిగాను వారికి ఈ పురస్కారాలు లభించాయి. ఇక జోడీ ఫాస్టర్ ‘ద మౌరిటానియన్’ సినిమాలో పర్ఫామెన్స్ తో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా సత్తా చాటింది. యాక్టర్స్ లో ఉత్తమ సహాయ నటుడుగా డేనియల్ కలూయా నిలిచాడు. ‘జూడాస్ అండ్ ద బ్లాక్ మెసాయా’ మూవీలో పాత్రకి ఆయన ఈ అవార్డ్ స్వంతం చేసుకున్నాడు. కొరియన్ మూవీ ‘మినారి‘ బెస్ట్ పారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా గ్లోడెన్ గ్లోబ్ కైవసం చేసుకుంది. 

ఈసారి గ్లోడెన్ గ్లోబ్స్ వేదికపై ప్రఖ్యాత సిసిల్ బీ డీమిల్లే అవార్డ్ తో జేన్ ఫాండాను సత్కరించారు. కరోల్ బర్నెట్ అవార్డ్ ను రచయిత, నిర్మాత అయిన నార్మన్ లియర్ అందుకున్నారు. 78వ గ్లోడెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకని ఈ సంవత్సరం ఫిబ్రవరీ 28న నిర్వహించారు. ఎప్పటికంటే రెండు నెలలు ఆలస్యంగా జరిగిన ఈ ప్రెస్టేజియస్ హాలీవుడ్ అవార్డ్స్ సెరిమనీని న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ నగరాల్లో రెండు చోట్ల నిర్వహించారు. కరోనా కారణంగా అనేక ముందు జాగ్రత్తల నడుమ గ్లోడెన్ గ్లోబ్స్ సంబరాలు అట్టహాసంగా కొనసాగాయి.