బుమ్రా స్థానంలో చాహర్‌...

బుమ్రా స్థానంలో చాహర్‌...

టీమిండియా, ఇంగ్లండ్‌ జట్ల మంగళవారం నుంచి ప్రారంభంకానున్న మూడు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ల స్థానంలో కొత్త వారిని బీసీసీఐ ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో దీపక్‌ చాహర్‌.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృనాల్ పాండ్యాలను జట్టులోకి తీసుకుంది. బుమ్రా జూన్ 12న జరగబోయే వన్డే సిరీస్ నాటికి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతని స్థానంలో వన్డే సిరీస్ కు ఎవరిని ఎంపిక చేయలేదు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ వన్డే సిరీస్‌కు సైతం దూరం కావడంతో అతని స్థానంలో వన్డేలకు స్పిన్నర్ అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. ఐర్లాండ్‌తో తొలి టి-20 సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ చేతి వేలికి గాయం కాగా.. ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. 

Photo: FileShot