మహానటిని చూసి షాక్ అయ్యారట..!!

మహానటిని చూసి షాక్ అయ్యారట..!!
సావిత్రి జీవితకథ ఆధారంగా నిర్మితమైన సినిమా మహానటి.  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మే 9 న విడుదల కాబోతున్నది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమా నిర్మించింది.  
సావిత్రి జీవితం గురించి దాదాపుగా అందరికి తెలుసు.  సినిమా జీవితం కాకుండా మిగతా లైఫ్ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారట.  దాదాపుగా ఆమె ప్రైవెట్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు.  మనకు తెలియని సావిత్రి జీవితం గురించి చెప్తున్నారు కాబట్టి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.  అంచనాలు పెరిగాయి. సావిత్రి పిల్లల కోసం మహానటిని స్పెషల్ గా ప్రదర్శించారట. సినిమా చూసిన చాముండేశ్వరి షాక్ అయింది. సావిత్రి కళ్ళముందు తిరుగుతున్నట్టుగా ఉందని..అమ్మను తిరిగి తమకు చూపించిన నాగ్ అశ్విన్, స్వప్న సినిమా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మహానటి నచ్చుతుందని..వారు అభిప్రాయపడ్డారు.