గోల్కొండ కోట భూగర్భంలో మరో కోట ?

గోల్కొండ కోట భూగర్భంలో మరో కోట ?

గోల్కొండ కోటలోని నయాఖిలా  భూగర్భంలో కట్టడాలు భయట పడుతున్నాయి. ఇంతకీ ఆ కట్టడాలు గోల్కోండ కోటకి సొరంగా మార్గామా కుతుభ్ షాహీలు ప్రత్యేక రక్షణ కోసం లేదా కుటుంభ సభ్యుల కోసం భూగర్భంలో మరో రహస్య కోటను నిర్మించారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రస్తుతం నయాఖిలా ప్రాంతంలో సైంటిఫిక్‌ క్లియరెన్స్‌ కోసం పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. దాదాపు 40 ఎకరాల స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా ఎక్కడ తవ్వినా పురాతన శిథిలాలు వెలుగు చూస్తున్నాయి. సుమారు 500 సంవత్సరాల క్రితం గోల్కొండ కోట నిర్మాణానికి, కోట పైకప్పులో ఉపయోగించిన తరహా రాళ్లు బయటపడుతున్నాయి. దీంతో భూగర్భంలో భారీ భవంతి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఏఎస్ఐ సౌతిండియా రీజనల్ డైరెక్టర్ మహేశ్వరి, మరింత జాగ్రత్తగా తవ్వకాలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.