చందా కొచ్చర్‌కు కోపం వచ్చింది

చందా కొచ్చర్‌కు కోపం వచ్చింది

తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ చందా కొచ్చర్‌ ఓ పట్టాన జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో చందా కొచ్చర్‌కు సెలవు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణ సమయంలో పదవిలో ఉండటం సరికాదని బోర్డు భావించింది. జస్టిస్‌ బీఎన్‌ కృష్ణ నేతృత్వంలో చందా కొచ్చర్ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని బోర్డు నిర్ణయించింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆమె సెలవుపై వెళ్ళాలని బోర్డు సమావేశంలో ప్రస్తావన వచ్చేసరికి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, బోర్డు సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక రాసింది. చందాకొచ్చర్‌పై వస్తున్న క్విడ్‌ ప్రొ క్వొ ఆరోపణలపై బోర్డు తొలుత పెద్దగా పట్టించుకోకున్నా.. ఎస్సార్‌ గ్రూప్‌ కంపెనీల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే రావడంతో ఈ విషయంలో కఠినంగా ఉండాలని బోర్డు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.