ఇదో కొత్త చరిత్ర: బాబు

ఇదో కొత్త చరిత్ర: బాబు

కర్నూలు జిల్లా రాజకీయాలు కోట్ల, కేఈ కుటుంబాల మధ్యే తిరిగాయని.. ఈ రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్రేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇవాళ టీడీపీలో చేరిన సందర్భంగా బాబు మాట్లాడారు. తానూ, కేఈ, సూర్యప్రకాష్‌రెడ్డి ముగ్గురం రాయలసీమ బిడ్డలమేని.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ వచ్చేందుకు కృషి చేస్తానని.. కోడుమూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిస్తానని బాబు హామీ ఇచ్చారు. విజయభాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్‌కు ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. తాను కూడా విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. 

'ఎల్‌ఎల్‌సీని కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తాం. ఒకే రోజు రూ.8,100 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చాం. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీరు తీసుకొచ్చాం. రాయలసీమ చరిత్రలో తొలిసారి 214 టీఎంసీల నీరు ఇచ్చాం' అని బాబు చెప్పారు.