మానవ తప్పిదం.. భారీ గాలుల వల్లే..!!

మానవ తప్పిదం.. భారీ గాలుల వల్లే..!!

భారీ గాలులు.. మానవ తప్పిదం కారణంగానే గోదావరిలో లాంచీ ప్రమాదం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం లాంచీ మునిగిన ప్రాంతానికి వెళ్లిన సీఎం సహాయక చర్యలను పర్యవేక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ప్రమాదంలో మొత్తం 22 మంది చనిపోయారని.. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్‌లో 12 మంది మృతదేహాలను వెలికి తీశామని.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది మొత్తం 126 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలను తలచుకుంటే బాధేస్తుందని... మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒక ఇళ్లు, పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తామని ప్రకటించారు. బోటు నిర్వాహకుల తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని.. బోటులో సిమెంట్ బస్తాలు, మోటార్ బైక్ కూడా ఉన్నాయని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.