రివర్స్ ఎన్నికలొస్తే బాగుండనుకుంటున్నారు !

రివర్స్ ఎన్నికలొస్తే బాగుండనుకుంటున్నారు !


గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ లీగల్‌సెల్‌ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ రాజ్యసభ ఎంపీ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్, 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు  పాల్గొన్న ఈ సమావేశం అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్లాడిన అయన రివర్స్ టెండర్ల వలన ఏమవుతుందో తెలియదని కానీ ప్రజలు మాత్రం రివర్స్ ఎన్నికలొస్తే బాగుండని అనుకుంటున్నారని అన్నారు. అయితే రివర్స్ పాలన ఉన్నా రివర్స్ ఎన్నికలకు ఆస్కారం లేదన్నారు. అయితే జమిలీ ఎన్నికలకు అవకాశం ఉందని, అదే నిజమైతే మూడేళ్ళలోనే ఎన్నికలొస్తాయని ఆయన పేర్కోన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇలాంటి అనాగరిక పరిస్థితులు లేవని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతికి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని అన్నారు. అవినీతిలో చిక్కుకొని ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వ్యక్తి తనపై ఆరోణలు చేస్తున్నాడని, గతంలోనూ తనపై 26 కేసులు పెట్టి ఒక్కటీ నిరూపించలేకపోయారని ఆయన పేర్కోన్నారు. ఏకంగా ఇప్పుడు ఇంకా తమపై అవినీతి దొరకలేదా అని అధికారులు, మంత్రులను దూషిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తామని ఆయన పేర్కోన్నారు. మరోపక్క మంత్రులకు గెజిట్‌కు, జీవోకు తేడా తెలియక పోవడం దురదృష్టకరమని కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియనివాళ్లు కూడా మంత్రులుగా ఉన్నారని విమర్శించారు.